
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి కోటలో జాతీయ పర్యాటక రంగ దినోత్సవం సందర్భంగా శనివారం ఏ.పి టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.జనార్ధన రెడ్డి పేర్కొన్నారు. స్థానిక చంద్రగిరిలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల విద్యార్థులు మరియు శ్రీ పద్మావతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు కలిసి ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్ శ్రీ రమణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఎంతో చారిత్రాత్మక ఘనత కలిగిన చంద్రగిరి కోట నందు జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్ డా. రమణ మూర్తి మాట్లాడుతూ.. చారిత్రాత్మక కట్టడమైన చంద్రగిరి కోట యొక్క చరిత్రను మరియు స్థానికంగా ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను గూర్చి విద్యార్థులకు తెలియజేసి వాటి గూర్చి వివిధ రకాల పోటీలను (చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ ) నిర్వహించారు. అలాగే పర్యాటక ప్రదేశాల గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన యూట్యూబ్ ,ట్విట్టర్, ఫేస్బుక్ ,ఇంస్టాగ్రామ్ మొదలగు వాటిని ఉపయోగించి విస్తృత ప్రచారం చేపట్టాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాలని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు తెలియపరిచారు. చంద్రగిరి మండల ఎంఈఓ లలితకుమారి మాట్లాడుతూ విద్యార్థుల్లో విజ్ఞాన విహార యాత్రలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని, ఆహ్లాదమును అందిస్తాయని ,మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే శారీరక ఎదుగుదలతో పాటు విద్యా నైపుణ్య అభివృద్ధి కూడా పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ఆలోచనలను,సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలని, తమ నూతన ఆవిష్కరణల ద్వారా సమాజానికి, దేశానికి గొప్ప కీర్తిని అందించాలని సూచించారు. మన చుట్టూ ఉన్న సమాజంలోని గొప్ప వారి స్ఫూర్తితో వారి ఆశయ సాధనలో భాగంగా తమ అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల బాలికల పాఠశాలల ఉపాధ్యాయులు, సిఆర్ఎంటిలు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





