Saturday, March 14, 2026

అర్హత కలిగిన వారికి నాలుగు పథకాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.

  • హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివారం నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు ప్రభుత్వ పథకాల గురించిన వివరాలను అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుండి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను అమలు చేస్తుందన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందు తాయన్నారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల తో పాటు అన్ని గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించి లబ్ధి దారులను గుర్తించినట్లు తెలిపారు. భూమిలేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి రూ.12 వేలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ప్రభుత్వ సాయం అందుతుందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామంలో గ్రామ సభను నిర్వహించి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల పంపిణీ ని లాంచనంగా ప్రారంభిస్తారని అన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలను అందజేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలు అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. పథకాల ప్రారంభోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హసన్ పర్తి మండలం పెంబర్తి, ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామాలలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించిన వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీను, రేషన్ కార్డులు గురించి డీఎస్వో కొమరయ్య, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకి సంబంధించిన వివరాలను గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి రాజేందర్ వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News