నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి: చందుర్తి మండలం మూడపల్లి గ్రామ ట్రాక్టర్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు గా సంటి నవీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు యూనియన్ సభ్యులు తెలిపారు. యూనియన్ లో 60 మంది సభ్యులు ఉండగా అందరి నిర్ణయంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికకు సహకరించినందుకు ట్రాక్టర్ యూనియన్ సభ్యులకు నూతన అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ఉప అధ్యక్షుడు పుల్కం అరవింద్, క్యాషియర్ అల్లూరి తిరుపతి రెడ్డి,కోశాధికారి అంజి, సలహాదారులు నేటికుంట అనిల్, బద్దం భాస్కర్ రెడ్డి,బొడ్డు ప్రకాష్ కార్యవర్గసభ్యులు గా ఆకుల బుచ్చన్న బొప్ప రాజు, ఇటీకాల మహి,గుజ్జుల నరేష్, పల్లపు వెంకటేష్, సంటి నరేష్ కార్యవర్గసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.





