నేటి సాక్షి , ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ములుగు జిల్లా పోలీసుల ఎదుట సిపిఐ మావోయిస్టు పార్టీ మణుగూరు ఏరియా కమిటీ సభ్యురాలు మడవి మంగ్లీ లొంగిపోయింది. ఓఎస్డి మహేష్ బాబాసాహెబ్ తెలిపిన వివరాలు చత్తీస్గడ్ రాష్ట్రం మల్లంపేట కు చెందిన మడవి మంగ్లీ చిన్నతనంలో తండ్రిని కోల్పోయి బోటి అనే మలిషియా కమాండర్ ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీలో చేరి పలు సంఘటనలలో కీలక పాత్ర పోషించింది. కాగా కుటుంబంతో ప్రశాంతత జీవితం గడపాలని ఉద్దేశంతో లొంగిపోవడం జరిగింది అని తెలిపారు.





