నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్. సి (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు స్థానిక ఉస్మాన్ సేట్ కాంప్లెక్స్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ డివిజన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు రుద్రారపు అనిల్ జాతీయ జెండా ఎగురవేశారు. డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని ఇందులో భారతదేశం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వం లౌకికవాదం వర్తిస్తాయని అధ్యక్షులు అనిల్ కుమార్ అన్నారు. అనంతరం స్వీట్లు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





