
నేటి సాక్షి, కొడిమ్యాల, జనవరి 27 : చాలా సంవత్సరాల నుండి సింగపూర్ లో ఉంటున్న ప్రవాస భారతీయుడు కొడిమ్యాల వాసి బైరి రవి రెండవ సారి లాంగ్ టైం సర్వీస్ బెస్ట్ వర్కర్ గా అవార్డు అందుకున్నాడు. గత 25 సంవత్సరాల నుండి సింగపూర్లో పనిచేస్తున్న బైరి రవి మొదటిగా 2015 లో, రెండవది 2025 లో ఈ అవార్డు అందుకున్నాడు. సింగపూర్ లో ఉంటున్న పలువురు తెలుగువారు, కొడిమ్యాల ప్రజలు అభినందించారు. ఇలాంటి మరెన్నో అవార్డులు అందుకోవాలని వారు కోరుకున్నారు.





