-నూతన కమిటీ నియామకం
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు) :
హుజురాబాద్ పట్టణంలో ఆదివారం రోజు ఆరె మరాఠా కమ్యూనిటీ కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఆరె బంధువుల ఐక్యత, ఓబీసీ సర్టిఫికెట్స్ గురించి మరియు సమాజంలో జరిగే ఆర్థిక అసమానతలు ఎలా అధిగమించాలి, ఈ కుల సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలో అనేక విషయాలు చర్చించడం జరిగినది. అనంతరం అధ్యక్షులుగా మొకిలి శ్రీనివాస్ (లెక్షరర్), ఉపాధ్యక్షుడిగా అంగీరక శంకర్ ప్రసాద్, కార్యదర్శిగా మొకిలి శ్రీనివాస్ (అడ్వకేట్), కోశాధికారిగా ఉపాసి రాజ్ కుమార్ లను సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా తిప్పారపు హరికృష్ణ, గోజ గాని సునీల్, ఉపాసి నరేష్, మొకిలి రాజయ్య నియమితులు అయ్యారు. ఈ సమావేశంలో మొకిలి రాజేందర్, మొకిలి బిక్షపతి, మొకిలి అనిల్, మొకిలి సునీల్, ఉపాసి సురేందర్, ఉపాసి సురేష, గోపిశెట్టి శ్రీనివాస్, రమేష్, నవీన్, మొకిలి మారుతి, మొగిలి రమ్య, నాగూర్ల గీత, అంగరిక సుజాత, గోజగాని హామిక తదితరులు పాల్గొన్నారు.





