Sunday, March 15, 2026

బస్సును ఢీ కొట్టిన ట్రాలీ ఆటో

  • ట్రాలీలో సుమారు 20 కి పైగా రోజువారి కూలీలు
  • పదిమందికి పైగా తీవ్ర గాయాలు
  • ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు
  • కూలీలందరూ మునిపల్లి గ్రామవాసులు
  • గూడూరు అంబాల మధ్యలో ఘటన

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : కమలాపూర్ మండలంలోని గూడూరు-అంబాల రహదారి మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతగట్టు-మునిపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మందికి పైగా మహిళలు వంగపల్లి గ్రామంలో కూలి పనులకు వచ్చి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కూలి పనులు ముగించుకొని తిరిగి వెళ్తుండగా గూడూరు-అంబాల మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న హనుమకొండ నుండి కమలాపూర్ వచ్చే ఆర్టీసీ బస్సును ట్రాలీ ఆటో అతివేగంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో సుమారు పదిమందికి పైగా మహిళలకు తీవ్ర గాయాలతో పాటుగా మిగతా వారికి కూడా గాయాలయ్యాయి. ట్రాలీ ఆటో నడిపే డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాల అవ్వడంతో అందరిని అంబులెన్స్ లో వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని సీఐఈ హరికృష్ణ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News