Sunday, March 15, 2026

పట్టణంలో ఘనంగా ఎలక్ట్రిషన్ దినోత్సవం

నేటి సాక్షి, మందమర్రి :– ప్రైవేటు ఎలక్ట్రిషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఎలక్ట్రిషన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఎలక్ట్రిషన్ దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రిషన్ సంఘం సభ్యులు థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, నేడు విద్యుత్ దీపకాంతులతో పగలు రేయి అనే బేధం లేకుండా అన్ని పనులను సులువుగా చేసుకునేందుకు కారణం థామస్ ఆల్వా ఎడిసన్ విశేష కృషి అని తెలిపారు. థామస్ ఆల్వా ఎడిషన్ బల్బుని కనిపెట్టిన జనవరి 27న ఎలక్ట్రిషన్ దినోత్సవంగా పరిగణిస్తూ, ఎలక్ట్రిషన్లు అంతా పండగ లాగా ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఎలక్ట్రిషన్స్ అందరం ఐకమత్యంతో సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎలక్ట్రిషన్లు, ప్లంబర్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News