- సొంత డబ్బులతో విద్యార్థులకు అల్పాహార పంపిణీ
- హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు
నేటి సాక్షి, రామడుగు( పురాణం సంపత్): రామడుగు మండల సింగిల్ విండో చైర్మన్ మంచి మనసును చాటుకున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అడగగానే అల్పాహార పంపిణీ కార్యక్రమం సోమవారం చేపట్టారు.ఈ అల్పాహారం వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు తుది పరీక్షలకు హాజరయ్యే వరకు ఈ అల్పాహార పంపిణీ కొనసాగుతుందని వెంకటేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం,విద్యార్థులు,తల్లిదండ్రులు వెంకటేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.గతంలో సైతం విద్యార్థులకు యూనిఫార్మ్స్ అందజేశారు.





