- తిప్పారపు శ్రీనివాస్, సిపిఎం మండల కార్యదర్శి

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్న ఇటుక బట్టిలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 6న ప్రజావాణిలో ఇటుక బట్టిలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో, మండల ఎంపీఓ మరియు పంచాయతీ కార్యదర్శి బెజ్జంకి విచారణకు హాజరయ్యారు. విచారణలో పక్కన నివసిస్తున్న వారిని ప్రశ్నించారు.అలాగే కల్లేపల్లి రోడ్డుకు పక్కన ఉన్న ఇటుక బట్టికి సంబంధించిన బూడిద, ఉనక, మట్టి నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. విచారణకు వచ్చిన ఎంపీఓ గారు దీనికి సంబంధించిన వివరాలు తెలియనివని, తాను ఏమీ చేయలేనని నిర్లక్ష్య సమాధానాలు ఇచ్చి విచారణను మధ్యలోనే ముగించారు.
ఈ సందర్భంగా తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటుక బట్టిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నిర్లక్ష్య సమాధానాలు ఇవ్వడం అనుమానాలకు దారితీస్తుందని, వెంటనే ఈ నిల్వలను సీజ్ చేయాలని కోరారు. విచారణ మధ్యలోనే ముగించడం బాధాకరమని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మరోసారి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి సాయి కృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





