Sunday, March 15, 2026

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం

  • మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గ్రామాలను సర్వతోముఖంగా అభిపర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అన్నివర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రజలు ప్రభత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్నారు. దులో భాగంగానే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేస్తున్నదని ఆయన వివరించారు. గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి, పార్టీ నాయకులు చెక్కిల్ల తిరుపతి,మాతంగి అనిల్, సంగు దేవయ్య, రాంరెడ్డి, మాంకాలి మల్లికార్జున్, శ్రీకాంత్, ఈగ రాజయ్య, సంగు వేణు, బోడ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News