- అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్

నేటి సాక్షి ప్రతినిది వనపర్తి జిల్లా 27 : సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఇంటర్మీడియట్ ప్రాక్టిల్ పరీక్షలు, పర్యావరణ విద్య, నైతిక మానవ విలువల పరీక్షల నిర్వహణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 3404 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 3187 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 41పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుండి 22వ తేది వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. జనవరి 29వ తేదీన నైతిక విలువలు, మానవ విలువలు బ్యాక్ లాగ్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది , జనవరి 30వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పై పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకో వాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.విద్యార్థులు పరీక్షలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు పరీక్షల సమయానికి నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.





