Sunday, March 15, 2026

స్పేస్ ఎక్స్పో ను విజయవంతం చేయండి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఉషోదయ పాఠశాలలో ఇస్రో, డిఆర్డిఓ సహకారంతో నిర్వహిస్తున్న స్పేస్, డిఫెన్స్ ఎక్స్పో ను విజయవంతం చేయాలని ఉషోదయ పాఠశాల డైరెక్టర్, కరస్పాండెంట్ యార్లగడ్డ బాలాజీ సోమవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని ఉషోదయ పాఠశాలలో ఇన్స్ స్పేర్ ఇండియా – 2025 కార్యక్రమంలో భాగంగా కలామ్స్ ఇనిస్ట్యూట్ ఎక్సలెంట్, యార్లగడ్డ అభిరామ్ మెమోరియల్ గ్రామ సేవ సంయుక్త ఆధ్వర్యంలో ఒక్కరోజు స్పేస్, డిఫెన్స్ ఎక్స్పో – 2025 కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు సుమారు 5000 మంది హాజరవుతున్నారని, కార్యక్రమం అనంతరం ఇన్స్పైర్ చైల్డ్, డొనేట్ ఎ బుక్ అబ్దుల్ కలాం విజయ గాధను తెలిపే పుస్తకాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల కరస్పాండెంట్ లు, ట్రస్మా జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News