
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హెడ్ కానిస్టేబుళ్లకు ఏ. ఎస్. ఐ గా పదోన్నతి కై మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అర్హత పరీక్షను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. భద్రాద్రి, కాళేశ్వం జోన్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషనలలో విధులు నిర్వహిస్తున్న 108 సివిల్ హెడ్ కానిస్టేబుల్లకు అందజేసే ఏ. ఎస్. ఐ పదోన్నతికై సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో అర్హత పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన హెడ్ కానిస్టేబుల్ కు ఖాళీలను ఏ. ఎస్. ఐ గా పదోన్నతి కల్పించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ సందర్భంగా శిక్షణార్థుల సౌకర్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ భోధన బోర్డు లను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాల్గవ పటాలంకామాండెంట్ రాం ప్రకాష్, అదనపు డీసీపీ రవి, వైస్ ప్రిన్సిపాల్ రమణ బాబు, ఇన్స్ స్పెక్టర్లు రవికుమార్, కిషన్, పాల్గొన్నారు.





