- టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా నియమితం
- మహేశ్వరం నియోజకవర్గం నందిగామ నరసింహ టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా నియమితుడు
నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నందిగామ నరసింహ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా నియమితులయ్యారు. నియామక పత్రం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి చేతుల మీదుగా దీప భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అందుకున్నారు.ఈ సందర్భంగా, దీప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… నరసింహ కార్యకర్తగా పార్టీకి ఎంతో సేవ చేశారని, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోనే కష్టపడే వారికి గుర్తింపు లభించింది. నరసింహ కు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి, సమర్థవంతంగా సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నరసింహ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఎస్సీ సెల్ చైర్మన్ నగర ప్రీతం, మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ కిచ్చన్న లక్ష్మారెడ్డి మరియు సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజల మద్దతు పొందే దిశగా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇజ్రాయిల్, ఒత్తుల రఘుపతి, సిహెచ్ యాదయ్య, ఆవుల యాదయ్య, మాజీ జెడ్పిటిసి బొక్క జంగారెడ్డి, బొక్క భూపాల్ రెడ్డి, నడికుడి శివ, చేపంగి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.





