నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణంలోని అర్బన్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీసులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమని,కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేరాల దర్యాప్తు,అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించవచ్చని తద్వారా నేరాలను నియంత్రించవచ్చని చెప్పారు.ఈకార్యక్రమంలో సీఐ నిరంజన్ రెడ్డి,ఎస్ఐ కిరణ్,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





