Sunday, March 15, 2026

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శ

నేటి సాక్షి, సికింద్రాబాద్ :
నిన్న నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారతమాత మహా హారతి ప్రోగ్రాంలో టపాసులు పేలిన సమయంలో ప్రమాదవశాత్తు అగ్గి మెరుపులు హుస్సేన్ సాగర్ లో ఉన్న రెండు బోట్లకు అంటుకొని మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో హుజురాబాద్ నియోజకవర్గం వల్బాపూర్ గ్రామానికి చెందిన ప్రణీత్ మరియు సునీల్ గాయపడ్డారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించి దైర్యం చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాలకు తన పూర్తి సహకారం అందిస్తానని, ఎల్లప్పుడూ వారి కోసం నిలుస్తానని హామీ ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆకాంక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News