నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. వాహనదారులకు ఇద్దరికీ తీవ్రంగా గాయాలు కాగా అధిక రక్తస్రావం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. పూర్తి వివరాలు తెలియరాలేదు.





