Sunday, March 15, 2026

ప్రెస్ క్లబ్ సభ్యులకు సన్మానం

నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ జెఎసి ప్రెస్క్లబ్ కార్యవర్గాన్ని మంగళవారం బిఆర్ఎస్ అధ్వర్యంలో జగిత్యాల జెడ్పి తొలి చైర్పర్శన్ దావ వసంత సన్మానించారు. అధ్యక్షులు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారి మచ్చ శేఖర్లతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులను శాలువలతో సన్మానించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల పని చేస్తున్న పాత్రికేయుల సేవలు మరువలేనివని ఆమె అభినందించారు. పేదల సమస్యలను మరిన్ని వెలుగులోకి తీసుకువచ్చి వారి సంక్షేమానికి మరింత కృషి చేయాలని పాత్రికేయులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేశం, ఎలిగేటి అనిల్, సత్యనారాయణ, తురగ శ్రీధర్రెడ్డి, సాయికుమార్, రాణి, ఉదయశ్రీ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News