Sunday, March 15, 2026

వీరాపూర్‌లో రైతు భరోసా పథకానికి ప్రజల నుంచి హర్షం

నేటి సాక్షి, బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలనలో భాగంగా నాలుగు పథకాలను అమలు చేయడానికి మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ. 12,000 పంట పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గార్లకు గ్రామ ప్రజలు, రైతులు, కాంగ్రెస్ నాయకులు కలిసి గ్రామపంచాయతీ ఆవరణలో పాలాభిషేకం నిర్వహించారు. సోమవారం రోజున గ్రామ రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందించిన నిధులు జమ కావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి చెన్నారెడ్డి,మిట్టపల్లి శ్రీనివాసరెడ్డి, మిట్టపల్లి రాజిరెడ్డి,చుక్క సమీకృత్, చుక్క హరీష్, చిలుముల శ్రీకాంత్, చిలుముల ప్రశాంత్, చిలుముల రాహుల్, రోవోజు కనకయ్య,రోవోజు సురేష్, వర్కోలు శంకర్, ఆర్షణపల్లి శేఖర్,మహంకాళి కుమార్, దాసరి శంకర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News