- త్వరలోనే బదిలీ కానున్నట్లు సమాచారం
- మరో ఇద్దరు మహిళ ఎస్పీలు సైతం ముమ్మర ప్రయత్నాలు
- అఖిల్ మహాజన్ కె అవకాశాలు మెండు
- జిల్లాలో జోరుగా చర్చ

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల జిల్లా ( కోక్కుల వంశీ ) : నిజమాబాద్ పోలీస్ కమిషనర్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రావడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. సుమారు 100 రోజులుగా నిజామాబాద్ కు సీపీ లేకుండా ఇంచార్జీతోనే నెట్టుకొచ్చారు. ఆ ఇద్దరి నేతల మధ్య కుదరని సయోధ్యతో సీపీ లేకుండా జిల్లా పాలన కొనసాగుతోంది. ఎట్టకేలకు రెండు రోజుల్లో అఖిల్ మహాజన్ ను నిజామాబాద్ సీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం వుంది. 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అఖిల్ మహాజన్ ప్రస్తుతం సిరిసిల్ల ఎస్పీగా పనిచేస్తున్నారు. అంతకుముందు మంచిర్యాల డీసీపీగా విధులు నిర్వర్తించారు. విధినిర్వహణలో నిక్కచ్చిగా కఠినంగా వుండే మహాజన్ మంచి ఐపీఎస్ అధికారిగా అనతికాలంలోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా వుంటే నిజామాబాద్ సీపీ కోసం మరో ఇద్దరు తీవ్ర ప్రయత్నాలు చేశారు. నిర్మల్ ఎస్పీగా పనిచేస్తున్న జానకీ షర్మిలా, గతంలో కామారెడ్డి ఎస్పీగా పనిచేసిన శ్వేతరెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. దాదాపు శ్వేత రెడ్డి వస్తుందని ప్రచారం జరిగింది. మరో ఇద్దరు ఐపీఎస్ లు కూడా కొద్ది రోజుల క్రితం తెరపైకి వచ్చారు. వీటన్నిటికీ తెర దించుతూ, సిన్సియర్ అధికారిగా పేరున్న అఖిల్ మహాజన్ నిజామాబాద్ సీపీగా రెండుమూడు రోజుల్లో బదిలీపై రానున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.





