- చల్మెడ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ఆర్ సి ఇంచార్జి కోక్కుల వంశీ : వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, సీనియర్ నాయకులు దొంతుల అంజనీకుమార్ తిరిగి తన సొంత పార్టీ బిఆర్ఎస్ పార్టీలోకి మంగళవారం చేరారు. బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జి చల్మెడ లక్ష్మినరసింహరావు పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. గత నాలుగు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ లోకి చేరిన అంజనీ కుమార్ మళ్ళీ తన సొంత పార్టీ బిఆర్ఎస్ పార్టీ లోకి చేరారు. ఈ సందర్భంగా ఆంజనీ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పార్టీ లో చేరిన నాలుగు రోజులకే అర్ధమైందని రానున్న రోజుల్లో అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని నమ్మి పార్టీ లోకి చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోస్కుల రవి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, సీనియర్ నాయకులు ఏస తిరుపతి, గడ్డం హనుమన్లు, కటకం మల్లేశం. పెండ్యాల తిరుపతి, బాల్ రెడ్డి, లచ్చిరెడ్డి,తంపుల సుమన్, మల్లారం తిరుపతి,తీగల దేవరాజం,రవిందర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.





