నేటి సాక్షి, వేమనపల్లి : పత్రిక రంగంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నేటి సాక్షి దినపత్రిక 2025 క్యాలెండర్ ను మంగళవారం చెన్నూర్ రూరల్ సీఐ డి. సుధాకర్, ఎస్సై శ్యాం పటేల్, తహసీల్దార్ రమేష్ తమ తమ కార్యాలయాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవ వార్తలు, ట్రెండింగ్ కథనాలు, మానవీయ కోణాలు, ప్రజలకు నచ్చేలా, అక్రమార్కులకు గుదిబండలా, అనాతి కాలంలోనే “నేటి సాక్షి” దినపత్రిక ప్రజాదారణ పొందిందని అన్నారు. దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నేటి సాక్షి దినపత్రికకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేటి సాక్షి రిపోర్టర్ ఒడిల ప్రభుదాస్, మన తెలంగాణా రిపోర్టర్ కొత్తవడ్ల ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





