- యువత సామాజిక భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
- దేశ భవిష్యత్తు యువత నడవడికపై ఆధారపడి ఉంది
- ప్రమాదాలు, చెడు అలవాట్లు, గుర్తించాలి
నేటి సాక్షి కోదాడ ప్రతినిధి (అనంతగిరి) : సామాజిక అంశాలు, రోడ్డు భద్రత మాదకద్రవ్యాల నిర్మూలన పై సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధి అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎమ్ డి జిలాని,కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, స్థానిక ఎస్సై నవీన్ కుమార్, పోలీస్ అధికారులు కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పోలీసు కళాబృందం సభ్యులు సామాజిక అంశాలు రోడ్డు ప్రమాదాలు మాదకద్రవ్యాల నిర్మూలన యువత ఆదర్శాలు యువత లక్ష్యాలు పలు అంశాలపై ఆటపాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… యువత చెడు వ్యసనాలు చెడు అలవాట్లకు లోనై వారి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు, తద్వారా దేశం యువశక్తిని కోల్పోతుంది. ఇలాంటి పరిణామాలు అభివృద్ధిని సామాజిక భద్రతను దెబ్బతీస్తాయి. కావున ప్రతి ఒక్క విద్యార్థి యువత సామాజిక భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సమాజంలో మంచి చెడుల పట్ల స్పృహ ఉండాలని ప్రమాదాలను గుర్తించాలని కోరారు. అనంతరం ఎం.వి.ఐ జిలాని మాట్లాడుతూ ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల వారి కుటుంబం వీధిపాలవుతుందని రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని మరీ ముఖ్యంగా యువత అజాగ్రత్తగా వాహనాలు నడపొద్దని కోరారు. మాదకద్రవ్యాలను నిర్మూలించడంలో యువత ప్రాథమిక భూమిక పోషించాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల కష్టాలను తెలుసుకోవాలని, విద్యార్థిని విద్యార్థులు అందరూ నైతిక విలువలను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ జయపాల్ రెడ్డి, ఏవో పాండురంగ ప్రసాద్, భూపతి రావు, ఇన్చార్జి ప్రిన్సిపల్ శివప్రసాద్, జాతీయ సేవా సంస్థ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ యల్లయ్య , గోపయ్య, కృష్ణ, నాగార్జున, ఈశ్వర చారి, గురులింగం, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ జానీ పాషా, రవీందర్ నాయక్, సాయి కృష్ణ, ఉపాధ్యాయులు విద్యార్థులు. తదితరులు పాల్గొన్నారు.





