Sunday, March 15, 2026

ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణా చర్యలు చేపట్టాలి
  • కేసుల చేదనకు అన్ని కోణాలలో అన్వేషించాలి
  • గ్రామాలను సందర్శించి పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలి
  • పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశం
  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 28 : వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రతీ గ్రామాన్ని పోలీస్ అధికారులు సందర్శించి గ్రామాలలో పూర్తి స్ధాయిలో నిఘా ఉంచి ఎప్పటి కప్పుడు నేరాలకు సంబంధించిన సమాచారం ముందస్తుగా తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు,అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలతో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులు తెలుసుకొని చాలా కాలము నుండి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని, పెండింగ్ ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి కేసులు చేదించాలన్నారు. ఈ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేందుకు అవకాశం ఉన్నందున ప్రతి గ్రామాన్ని పోలీస్ అధికారులు వారానికి ఒక సారి సందర్శించి పూర్తి స్ధాయిలో నిఘా ఉంచాలని, గ్రామాలలో సమస్యలు సృష్టించే వారిని ముందు గానే గుర్తించి తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎక్కవ మంది పబ్లిక్ తో పోలీస్ అధికారులు కాంటాక్ట్ కావడం ముందస్తు సమచారం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇసుక, పీ.డి.ఎస్ రైస్ అక్రమ రవాణా, పేకాట జరగకుండా పకడ్బందీగా నిఘా ఉంచి పట్టుకొని కేసులు నమోదు చెయ్యాలని అన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు.చర్యలు తీసుకోవాలని అధికారులకు సూపెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా,మట్కా,బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లకు కొత్తగా వచ్చిన సిబ్బందికి ప్రజలతో ఎలా మాట్లాడాలో, ఎప్పుడైనా సమస్యలు తలెత్తినపుడు ప్రజలతో ఎలా వ్యవహరించాలో తెలుసుకునేలా వారికి స్వేచ్ఛను కల్పించాలని, తరచు గ్రామాలను సందర్శించేలా చేసి విధుల పట్ల అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో వనపర్తి డిఎస్పి,వెంకటేశ్వరరావు , డిసిఆర్బి డిఎస్పి, ఉమా మహేశ్వరరావు , సైబర్ క్రైమ్ డిఎస్పి, రత్నం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, గోపాల్ రెడ్డి, వనపర్తి సిఐ, క్రిష్ణ, కొత్తకోట సీఐ, రాంబాబు, ఆత్మకూర్ సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, డిసిఆర్బి సిబ్బంది, ఐటి కోర్ సిబ్బంది, కార్యాలయం సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News