
నేటి సాక్షి గోదావరిఖని (గణేష్) : తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, అధ్యక్షతన కనీస వేతన పెంపు పై ILO , రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకుల తో త్రైపాక్షిక సమావేశం. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (CESS) యందు ఏర్పాటు.చేసిన కనీస వేతనాల పెంపు అవగాహన త్రైపాక్షిక సమావేశానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్. కార్మిక ఉపాధి శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్. ILO నుండి రంజిత్ ప్రకాష్, అనూప్ సత్పతి, లేబర్ కమిషనర్ సెక్రటరీ జాజు, కనీస వేతన సలహా మండలి సభ్యులు నరసింహ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజు ముదిరాజు, ప్రో రవి, ప్రో వాసంతి ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్య ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులు. ఈ సదర్భంగా మాట్లాడుతూ… గత పదేళ్లుగా తెలంగాణ లో కనీస వేతనాలు పెరగక రాష్ట్రంలో ఉన్న కోటి ఇరవై లక్షల మంది కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని దానిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందరలో కార్మికులకు మెరుగైన వేతనాలు పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి బోర్డు సభ్యుల నియామకం చేశారని అంతే కాకుండా మొట్టమొదటి సారి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సలహా మేరకు శాస్త్రీయ పరమైన విధానంలో అటు ప్రాశ్రామిక వేత్తలకు ఆమోదయోగ్యంగా ఇటు కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా కృషి చేస్తామని మొన్నటికి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దావోస్ పర్యటన లో భాగంగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబట్టారని,a త్వరలోనే అన్ని సంఘాల అభిప్రాయాల మేరకు కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతన పెంపు వొప్పందం చేస్తామని తెలిపారు.





