Sunday, March 15, 2026

న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న ఏఈ

  • జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న ఏఈ
  • చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న యూనియన్
  • పైసలీయందే పనులు చేయరు
  • ప్రతి పనికి రేటుకట్టి వసూలు
  • తెలిసినా మిన్నకుంటున్న ఉన్నతాధికారులు
  • విద్యుత్ శాఖలో కొందరి అవినీతిపై ఆరోపణలు

మెదక్ జిల్లా నేటి సాక్షి (భూమయ్య) : కొల్చారం మండలంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయింది. స్థానికంగా పనిచేసే అధికారులు కూడా ఆయనకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు ఆ ఏఈ రెండేళ్ల ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేయడం బాగా కలిసిస్తోంది. ప్రతి పనికి రేటు కట్టి వసూలు చేస్తున్నాడు. ఏ పని అయినా ఈయన రేటు కుదిరించిన ఆరోపణలున్నాయి. అందుకనుగుణంగానే ఇదే మండలంలో పనిచేస్తున్న మరో లైన్మన్ను ఇటీవల ధర్మవరం బదిలీ చేశారు. అతను అక్క డికీ వెళ్లకుండా పాతస్థానంలోనే పనిచేస్తూ అవినీతి అక్ర మాలకు పాల్పడుతున్నాడు. ఈయనతో ఓ అధికారి కుమ్మక్కై వినియోగదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. లైన్మన్ ఓ రైతు నుంచి ట్రాన్స్ ఫార్మర్ కోసం రూ. 15 వేలు తీసుకున్నట్టు తెలిసింది. ఆ సొమ్ము సరిపోదని రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. అంత సొమ్ము ఇచ్చుకోలేని రైతు స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళ్తానని చెప్పడంతో రైతు దగ్గర నుంచి లైన మన్ జారుకున్నట్టు తెలిసింది. అవినీతికి పాల్పడుతున్న ఈ అధికారి ఏఈ అహ్మద్ అలీ రెండు రోజుల క్రితం ఉన్న తాధికారుల నుండి ఉత్తమ అవార్డు అందుకున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ అక్రమాలకు పాల్పడుతు ఆపీస్ లోనే దర్జాగా నిద్రిస్తున్న ఏఈ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. విషయం తెలుసుకుని న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్ట్ రామకృష్ణ పై చేయి చేసుకున్న ఏఈ ఫై చట్టపరమైన చర్య తీసుకోవాలని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News