
నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : గ్రామ ప్రజలు ఎన్టిపిసి వలన అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆయా గ్రామాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పన గురించి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్. అధికారులకు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించారు. జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లబ్బర్ స్టాంప్ గా వ్యవహరిస్తుంది. ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిని ఎన్టిపిసి యజమాన్యం విస్మరిస్తుందని అన్నారు. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు ప్రాధాన్యత కల్పించాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్.
కాంట్రాక్ట్ కార్మికుల నియామకాల విషయంలో అవినీతి జరుగుతుంది కలెక్టర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. నీరు నిధులు నియమాకాల విషయంలో ఎన్టిపిసి యజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు ఎన్టిపిసి అధికారులు ప్రజల పట్ల మర్యాదగా వివరించాలని లేదంటే ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు అనేసి హెచ్చరించారు రోడ్లు చెరువులు పట్టణ అభివృద్ధి పనులు సి ఎస్ ఆర్ నిధులు ఖర్చు చేయాలన్నారు. ఎమ్మార్వో కార్యాలయం నుండి కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయం వరకు అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలి.
ఎమ్మార్వో కార్యాలయం నుండి ఎన్టీపీసీ PTS మెయిన్ గేట్ వరకు నిరుపయోగంగా ఉన్న 8 హై టెన్షన్ టవర్లును తొలగించాలి. పోలీస్ కమిషనర్ కార్యాలయం సోలార్ ప్లాంట్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఒక్క అధునాతన స్టేడియం స్థానిక ప్రజల ఉపయోగార్థం నిర్మించాలి.
గోదావరిఖని గోలివడా సమ్మక్కా జాతర జరిగే అభివృద్ధి చేసి దేవాదాయ శాఖకు అప్పగించాలి. ఎన్టీపీసీ పోలీసు స్టేషన్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ మధ్యలో పెట్రోల్ బాంక్ నిర్మాణం కోసం 100 M X 100 ఎం స్థలాన్ని కేటాయించాలి. ఎన్టీపీసీ ప్రస్తుతం ఉన్న ప్లాంట్లలో రాబోయే ప్లాంట్లలో స్కిల్డ్, సెమి- స్కిల్డ్, ఆన్- స్కిల్డ్ క్యాటగిరి లలో 100 శాతం స్థానిక నిరుద్యోగ యువతకు మాత్రమే ఉపాధి కల్పించాలి. కాలుష్యం భారిన పడుతున్న మతాంగి కాలనీ ఇళ్లను తరలించి పునరావాసం కల్పించాలి. కాంట్రాక్టు ఉద్యోగులు కుటుంబ సబ్యులకు అన్ని వసతులతో కూడిన హాస్పిటల్ ను ఏర్పాటు చేసి వైద్య సౌకర్యాలు అందించాలి. కాంట్రాక్టు కార్మికుల అవుట్ సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలు అలవెన్స్ లు పెంచాలి. 360 కోట్ల రూపాయలు ప్రభావిత డివిజన్ల మరియు గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధి కొరకు కమ్యూనిటీ హాళ్లు, స్కూల్స్, రోడ్స్, డ్రైనేజీ, నిర్మాణం కోసం నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. సి.ఎస్ ఆర్ నిధులు కేవలము రామగుండం నియోజకవర్గంలో మాత్రమే ఖర్చు చేయాలి. రామగుండం చెరువు పునరుద్ధరణ చేపట్టాలి ( ASH POUND). ఎన్టీపీసీ పోలీసు స్టేషన్ నుండి మార్కెట్ వరకు ఉన్న ఖాళీ స్థలంలో 100 షాప్ ల నిర్మాణం చేపట్టాలి. పైన పేర్కొన్న ప్రధాన డిమాండ్లను పరిశీలించి. ఉన్నటువంటి ఎన్టీపీసీ సంస్థ రామగుండం అభివృద్ధికి అండగా ఉండాలని , ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల ప్రజల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి తమ అభిప్రాయాలను తెలియజేసారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్,ఎన్టీపీసీ ప్రభావిత ప్రజలు, మేయర్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





