Sunday, March 15, 2026

చందుర్తి మండలానికి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

  • 2 కోట్లు 70 లక్షల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
  • హర్షం వ్యక్తం చేసిన మండల ప్రజలు

నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి (సతీష్) : పలు అభివృద్ధి పనులుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కృషీతో వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల రోడ్ల మరమ్మతులకు యం.ఆర్.ఆర్ గ్రాంట్ 2 కోట్ల 70 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చందుర్తి మండలం చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామం నుండి ఎనగల్ రోడ్డు మరమ్మత్తుకు 1 కోటి 50 లక్షలు, మూడపల్లి ఆర్ అండ్ బి రోడ్డు నుండి నర్సింగాపూర్ (ఎస్సీ కాలనీ) వరకు 1 కోటి 20 లక్షలు మంజూరు చేశారు. చందుర్తి మండల ప్రజల చిరకాల స్వప్నం, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్రిడ్జిలు, పలు రోడ్ల మరమ్మతులకై 2 కోట్ల 70 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు వర్షం వ్యక్తం చేశారు. ఇట్టి అభివృధ్ధి పనులకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News