
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఉషోదయ పాఠశాలలో కేఐవైఈ ఫౌండేషన్, అభిరామ్ మెమోరియల్ గ్రామసేవ ఆధ్వర్యంలో ఇస్రో, డిఆర్డిఓ సహకారంతో మంగళవారం నిర్వహించిన ఇన్ స్పేర్ ఇండియా-2025 కార్యక్రమంలో భాగంగా సాంకేతిక ప్రదర్శన అట్టహాసంగా నిర్వహించగా, ఆధ్యాంతం విద్యార్థులను ప్రదర్శన అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, విశిష్ట అతిథులుగా డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఐఏఎస్, డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఇస్రో సీనియర్ సైంటిస్ట్ ఈ శివశంకర్, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శంకర్, మంచిర్యాల డిఎస్ఓ మధుబాబు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్రో, డిఆర్డిఏ నుండి తీసుకువచ్చిన సాంకేతిక, రక్షణ విభాగానికి సంబంధించిన నమూనాలను విద్యార్థులకు అవగాహన కల్పించేలా ప్రదర్శన నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు మున్ముందు డాక్టర్ సతీష్ రెడ్డి స్ఫూర్తితో ఇస్రో, డిఆర్డిఓ లాంటి సంస్థలో చేరి, ప్రభుత్వానికి, దేశ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల పరిసర ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సుమారు 7000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఐవైఈ ఫౌండేషన్ సభ్యులు యార్లగడ్డ అభిరామ్ మెమోరియల్ గ్రామ సేవ సంఘం వ్యవస్థాపకులు వై చైతన్య బాలాజీ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన గుస్సాడి సాంప్రదాయ నృత్యం వీక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ఉషోదయ పాఠశాల చెందిన వివిధ రకాల క్లబ్ స్టాల్స్ లు, స్వాగత నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ట్రస్మా మంచిర్యాల కరస్పాండెంట్లు, ఉషోదయ పాఠశాల ప్రిన్సిపల్ వై బాలాజీ, అకాడమిక్ డైరెక్టర్ వి సత్యనారాయణ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





