Sunday, March 15, 2026

గద్దర్ అవార్డును వ్యతిరేకిస్తే బండి సంజయ్ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తాం

  • టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ప్రజా నౌక గద్దర్ జాతికి చేసిన సేవను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేస్తే కేంద్రమంత్రి బండి సంజయ్ గద్దర్ ను కించపరిచేలా మాట్లాడడం హేయనీయమని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ అన్నారు. గద్దర్ కు పద్మశ్రీ అవార్డు సిఫార్సును వ్యతిరేకించిన బండి సంజయ్ మాటలను ఆయన ఖండించారు. గద్దర్ దళిత సామాజిక వర్గం మాల కుటుంబంలో పుట్టి తనకోసం ఏ రోజు పనిచేయలేదని, పేద, పీడిత, బడుగు, బలహీన వర్గాల కోసమే ఆయన పోరాటం కొనసాగించారన్నారు. గద్దర్ బిజెపి వాళ్ల మీద దాడులు చేయాలని ఎక్కడ ప్రకటించలేదని, కానీ ప్రతిసారి బిజెపి వాళ్లు గద్దర్ పై కుట్రలు చేస్తూనే ఉన్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటివి మానుకోవాలని మతతత్వ వాదులను హెచ్చరిస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వానికి, మావోయిస్టులకు జరిగిన చర్చలలో కూడా క్రియాశీల పాత్ర పోషించిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నినాదాన్ని తారాస్థాయికి చేర్చేలా గద్దర్ ప్రముఖ పాత్ర పోషించాడన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వయంగా దేశ ప్రధాని గద్దర్ సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేస్తే బండి సంజయ్ విమర్శించడం సిగ్గుచేటన్నారు. గద్దర్ మరణానంతరం ప్రధానమంత్రి మోడీ వారి కుటుంబానికి గొప్ప వ్యక్తి అని లేఖ రాసిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పద్మశ్రీ అవార్డుకు గద్దర్ ఎంపిక చేయడానికి అడ్డుకోవాలని చూస్తే బండి సంజయ్ ఇంటి ముందు దళితులమంతా వెళ్లి చావు డబ్బు కొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. గద్దర్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ జీడి రవితేజ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చల్లూరి రాహుల్ తదితరులున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News