- కరీంనగర్ సదరం క్యాంపు తేదీల విడుదల
- అర్హులైన దివ్యాంగులు సదరం వినియోగించుకోవాలి
- దివ్యాంగ సమాచారం వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవుల శ్రీనివాసు

నేటి సాక్షి, కరీంనగర్ :
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారి సదరం శిబిరం యొక్క ప్రకటన జనవరి 28న విడుదల చేసినట్లు దివ్యాంగ సమాచారం వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవుల శ్రీనివాసు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ శిబిరంలో 2025 ఫిబ్రవరి, మార్చి నెలలలో నిర్ణయించబడిన తేదీ లలో స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్టులో ఉన్న దివ్యాంగులు తమకు కేటాయించిన తేదీలలో హాజరుకావాలని తెలిపారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారి ఫోన్ నెంబర్లకు మెసేజ్ వస్తుందని అన్నారు. తమ తమ వైద్య రిపోర్టులు ఎక్స్రేలు బుకింగ్ చేసుకున్న రసీదు నంబర్లు ఆధార్ కార్డు మొదలగు కాఫీలు వెంట తీసుకెళ్లాలని అన్నారు. మీయొక్క సదరం వ్యాలిడిటీ గడిచిపోయినట్లయితే రెన్యువల్ కొరకు జనవరి 29 తేదీన ఉదయం 11 గంటల నుండి మీ ప్రాంతీయ మీసేవ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ప్రకటనలో వెల్లడించినట్లు తెలిపారు. కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందగోరు వారు తమ తమ ప్రాంతీయ మీసేవ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. నూతన స్లాట్ బుకింగ్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రత్యేకమైన తేదీలు ఏవి ఉండబోవని అన్నారు. ఆర్థోపెడిక్ వారికి ఫిబ్రవరి 3,4, మార్చి 4 తేదీలలో, మానసిక రోగులకు ఫిబ్రవరి 6, మార్చి 11 తేదీలలో, కంటి చూపు ఫిబ్రవరి 10, మార్చి 18 తేదీలలో, వినికిడి మూగ చెవిటి వారు ఫిబ్రవరి 13, మార్చి 24 తేదీలలో తమ తమ పత్రాలతో హాజరుకావాలని అన్నారు. దివ్యాంగ మిత్రుడు అందరూ ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవాలని దివ్యాంగ సమాచారం వ్యవస్థాపక అధ్యక్షులు కోరారు.





