Sunday, March 15, 2026

మామునూర్ ఏయిర్ ఫోర్ట్ పై కలెక్టర్ సమీక్ష

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మామునూర్ ఎయిర్పర్ట్ పై మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గుంటూరు పల్లె రైతులతో సమీక్ష నిర్వహించడమైనది. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ వలన జిల్లా ఎంతో అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్లు పారిశ్రామిక జిల్లాగా ఎదుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు పల్లె రైతులు మాట్లాడుతూ రోడ్డు కనెక్టివిటీ కావలసింది గా కోరగా అట్టి విషయంపై ఆర్ అండ్ బి ఈ ఇ జితేందర్ రెడ్డి మరియు రెవెన్యూ అధికారులైన ఖిలా వరంగల్  తహసిల్దార్ నాగేశ్వరావు ను పరిశీలించ వలసిందిగా ఆదేశించడమైనది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి ఆర్డీవో సత్యపాల్ రెడ్డి సంబంధిత అధికారులు గుంటూరు పల్లె రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News