నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి (కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల గోరుముద్ద కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ రూ. 5వేల రూపాయలను ఆర్థిక సహాయకంగా అందచేశారు. సందర్భంగా ఇప్ప మహేష్ మాట్లాడుతూ .. పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు ప్రత్యేక తరగతులు జరుగుతున్న సందర్భంగా గోరుముద్ద కార్యక్రమానికి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసినట్టు తెలిపారు. తను ఇదే పాఠశాలలో చదివనని అలాగే తమ అభిమాన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చదువుకున్న పాఠశాల కాబట్టి రానున్న రోజుల్లో మరింత సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తిర్ణత సాధించి మండలానికి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకువరాలని కోరారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి 5000/- , దయ్యాల కమలాకర్ 2000/- మర్రిపెళ్లి కల్పన 2000/- గోరుముద్ద కార్యక్రమానికి సహాయం అందించినట్టుగా హెడ్ మాస్టర్ సమ్మి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య,ఆలయ చైర్మన్ కొమిరె శంకర్, నాయకులు తర్రె మనోహర్,ఎర్రం గంగనర్సయ్య, నవీన్,తదితరులు పాల్గొన్నారు.





