నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ యుట్యూబ్ ఫోక్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని మంగళవారం నూతనంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా తొగరి కరుణాకర్, ఉపాధ్యక్షులుగా తాళ్లపల్లి నాగరాజు, నాగం మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా తాండ్రల తిరుపతి, అర్సం తిరుపతి, సహాయ కార్యదర్శులుగా చెప్పాల సంతోష్, విలాసాగర్ శేఖర్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన తొగరి కరుణాకర్ మాట్లాడుతూ… యూట్యూబ్ ఫోక్ సమస్యల పై నిరంతరం కృషి చేస్తానని, ప్రొడ్యూసర్స్ లకు, డైరెక్టర్లకు, నటీనటులకు, డిఓపిలకు ఎలాంటి సమస్య వున్న వారికి సహకరించి అండగా వుంటానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన తోటి ప్రొడ్యూసర్ల అందరికీ కృత్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి రాజ్ మాస్టర్, అశోక్ భోగే, మారం ప్రవీణ్ కుమార్, రఘు జాన్, గంగ శ్రీకాంత్, పరశురాం నాగం, శేఖర్ వైరస్, ప్రశాంత్ ఏపియస్, పయిండ్ల రాజేష్ లతో పాటు ముఖ్య అతిథులుగా డిఓపి హరీష్ పటేల్,కమ్లి పటేల్ పాల్గొన్నారు.





