- నాబార్డ్ నిధుల ద్వారా సుమారు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీ కారం చుట్టిన ఎమ్మెల్యే
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : యర్రావారిపాళ్యం యర్రావారిపాళ్యం క్రాస్ నుండి చెరుకువారిపల్లి వయా రోడ్డును చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని ప్రారంభించారు ముందుగా యర్రావారిపాలెం క్రాస్ కు చేరుకున్న ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం యర్రావారిపాలెం పంచాయతీ క్రాస్ – చెరుకువారిపల్లి నూతన అర్ అండ్ బి రోడ్డుకు ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి రోడ్డును ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యర్రావారిపాళ్యం క్రాస్ నుండి చెరుకువారిపల్లి వయా రోడ్డు 21 కిలో
మీటర్ల రోడ్డును నాబార్డ్ నిధుల ద్వారా సుమారు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీ కారం చుట్టినట్లు తెలిపారు ఈ రోడ్డు వేయడం ద్వారా యర్రావారిపాలెం క్రాస్ నుండి రాయచోటికి వెళ్ళడానికి సుమారు 17 కిలో మీటర్లు రోడ్డు ప్రయాణం తగ్గడంతో పాటు సుమారు 40 గ్రామాల ప్రజలుకు రాను… పోను వీలుగా ఉంటుంది అని తెలిపిన ఎమ్మెల్యే. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని ప్రజలకు, నాయకులకు కార్యకర్తలకు పిలుపు నిచ్చినారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





