నేటిసాక్షి, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి స్టాప్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు,మండల విద్యాధికారి ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 18న పెద్దపల్లి జోనల్ లెవెల్ 14 సంవత్సరాల బాలబాలికల పోటీల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 29 నుంచి 31 వరకు మెదక్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొన్నట్లు ఆయన వివరించారు. పాఠశాల నుంచి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల క్రీడా ఉపాధ్యాయుడు మహేష్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను ఉపాధ్యాయుల బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సామల కవిత, గ్రామస్తులు అభినందించారు.





