Sunday, March 15, 2026

దళిత బంధు రెండో విడత నిధుల విడుదల

  • దళిత బంధు నిధుల విడుదలకు వోడితల ప్రణవ్ కృషి.
  • పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులకు నిధుల విడుదల విషయంలో అభ్యర్థన.
  • ప్రభుత్వ నిర్ణయంతో దళిత సామాజిక వర్గానికి భారీ ఊరట.
  • పొన్నం ప్రభాకర్, ఉత్తంకుమార్ రెడ్డి లకు కృతజ్ఞతలు.
  • పార్టీ అధికారంలో ఎమ్మెల్సీగా, విప్ గా వుండి కౌశిక్ రెడ్డి విఫలం.
  • దళితులను మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి.

-హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ దళిత సామాజిక వర్గానికి తీపి కబురును అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం.దళిత బంధు రెండో విడత నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్, వివిధ మంత్రులకు చేసిన వినతులను పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించి దానికి సంబంధించిన జీవోను మంగళవారం నాడు విడుదల చేశారు.గత ఉప ఎన్నికల సమయంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళిత బంధు పూర్తిస్థాయిలో బిఆర్ఎస్ ప్రభుత్వం అందించలేకపోయింది. కాగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు ఉన్నా వారికి నిధులు విడుదల చేయలేక వారిని ఇబ్బందులకు గురిచేసింది. అయితే గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు నిధులు విడుదల చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇప్పుడు నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ నిధులు రావడంలో స్థానికంగా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ పూర్తిస్థాయిలో సఫలీకృతుడయ్యాడు. ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కు పలుమార్లు ఈ విషయంపై చర్చించి వినతులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుందని మరోసారి ఈ నిధుల విడుదల ద్వారా అర్థమైందని దళితుల పట్ల నిజమైన ప్రేమ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుందని రుజువైందని ప్రణవ్ అన్నారు. మూడేళ్ల పాటు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉండి అధికారంలో ఉన్న కూడా దళితులకు దళిత బంధు ఇప్పించడంలో కౌశిక్ రెడ్డి విఫలమయ్యాడని ఎద్దేవా చేశారు.నిధుల విడుదల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అందజేస్తామని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News