నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ రమేష్, జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ కి గట్టు మండలం ముచోనిపల్లి గ్రామంలో ఎం పి హెచ్ ఎస్ పాఠశాల ఆవరణలో గుడి నిర్మాణం వొద్దు అని కలెక్టర్ కి ఆ గ్రామస్థులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. గుడి నిర్మాణం వొద్దు అని గతంలో కూడా ఎన్నోసార్లు ఎం ఈ ఓ కి డి ఈ ఓ కి ఫిర్యాదు చేసిన ఫలితం లేక పోయింది అందుకే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము అన్నారు.కాబట్టి వెంటనే పాఠశాల ఆవరణలో పిల్లలకు ఆట స్థలం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఈరోజు అక్కడ స్థలం లేక పిల్లలు కి ఆటలు కూడా చాలా ముఖ్యం కాబట్టి వెంటనే పాఠశాల ఆవరణలో గుడి నిర్మాణం వొద్దు అని తమరితో విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. స్థానిక ఉపాధ్యయులు కూడా పట్టించుకోకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్కడ నిర్మాణం చేయుట ఏంటి అని అన్నారు కాబట్టి అక్కడ గుడి నిర్మాణం వేరే స్థలం లో నిర్మించాలి అని అన్నారు. ముచ్చనిప్పల్లి గ్రామంలో ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో బండరి సునంద్ ఆర్ ఎస్ పీ టీం అధ్యక్షుడు, కొమ్ముల ప్రవీన్ తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు మరియు ముచినిపల్లి గ్రామస్థులు భాస్కర్, దేవేంద్ర, సుమన్, ప్రభాస్, ఇజ్రాయేల్, మధు, అశోక్, పౌలు, గోవిందు, మరెన్న, యేసురాజు,రాజు తదితులున్నారు.





