Monday, March 16, 2026

పి డి ఎస్ యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయండి

నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఫిబ్రవరి 4,5తేదీలలో జరిగే జనరల్ కౌన్సిల్ పోస్టర్లు దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవిష్కరణ.విద్యారంగ బలోపేతం కోసం, విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం, ఫిబ్రవరి 4,5 తేదీలలో బత్తుల నగర్, భద్రాచలం పట్టణంలో జరిగే పి డి యస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ పిలుపునిచ్చారు.మంగళవారం చర్ల ప్రభుత్వజూనియర్ కళాశాలలో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పి డి యస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. అనంతరం కళాశాలలో పిడిఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునగల శివప్రసాద్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజికించుకునేందుకు ప్రతిపక్షంలో ఉండి విద్యార్థుల తరపున గొంతు విప్పిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయడం లేదనే సత్యాన్ని రాష్ట్రంలోమేధావులు, ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు, గుర్తించారని అన్నారు. రాష్ట్రంలో గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే అత్యున్నత న్యాయస్థానమే మందలించే స్థితికి మన విద్యా వ్యవస్థ దిగజారిపోయిన స్థితిని ముఖ్యమంత్రి గుర్తించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పెనుమారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అధ్యాపక, అద్యాపకేతర పోస్టులు భర్తీ చేయడం వదిలేశారని, విశ్వవిద్యాలయాలలో కనీస సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని గాలికి వదిలేసారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం, దేశంలో అందరికి సమానమైన, నాణ్యమైన ఉచిత విద్య సాధించడానికి, ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాల సాధనకై పీడీఎస్యూ రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్త విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నూతన ఒరవడితో ముందుకు సాగడానికి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ లో చర్చించి భవిష్యత్తు ఉద్యమ రూపకల్పనలు చేసి, విద్యారంగ సమస్యలపై అనేక తీర్మానాలు చేసి, విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి పోరాటాల రూపకల్పన చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదీష్, మహేష్, తరుణ్, అలేఖ్య, వర్షిని తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News