Monday, March 16, 2026

సంక్షేమ పథకాలు గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకొవాలి

  • ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్

నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకొని స్వస్శక్తితో కుటీర పరిశ్రమ నెలకొల్పుకొని వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించడం సంతోషకరమని, అలాగే మార్కెట్ పరంగా వెసులుబాటు కల్పించుకొని ఆర్థికంగా లాభాల బాటలో నడవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. బుధవారం నాడు భద్రాచలం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నెలకొల్పిన శ్రీ లక్ష్మీ గణపతి మహిళ ట్రైబల్ లియాబిలిటీ గ్రూప్ న్యూట్రిషన్ మిక్స్ అండ్ డ్రై మిక్స్ యూనిట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన డ్రై మిషన్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులైన గిరిజనయువతులు 24 లక్షల సబ్సిడీతో 40 లక్షల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన న్యూట్రి డ్రైమిక్స్ యూనిట్ ను గిరిజన మహిళలు అందరూ కలిసికట్టుగా ఉండి చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పుకొని జీవనోపాధి పెంపొందించుకోవడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు. యూనిట్ కాస్ట్ మరియు న్యూట్రి డ్రై మిక్స్ ద్వారాఎటువంటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారో మహిళలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది జీవనాధారం పెంపొందించుకోవడానికి 40 లక్షల కాస్ట్ తో శ్రీ లక్ష్మీ గణపతి మహిళా ట్రైబల్ రియాబిలిటీ గ్రూప్ న్యూట్రిషన్ అండ్ డ్రై మిక్స్ యూనిట్ నెలకొల్పుకొని, తయారు చేసిన న్యూట్రి ఫుడ్స్ ను మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకొని అమ్మకాలు జరుపుకొని లబ్ధి పొందాలని అన్నారు. యూనిట్ ఏర్పాటుకు 40 లక్షలు యూనిట్ కాస్ట్ కాగా 24 లక్షలు సబ్సిడీ మరియు నాలుగు లక్షలు బెనిఫిషర్ కంట్రిబ్యూషన్, బ్యాంకు రుణము 12 లక్షలు అందించడంతో యూనిట్ ఏర్పాటు చేసుకున్నామని మహిళలు తెలిపారు. నిరుద్యోగులైన గిరిజన యువతులు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని ఆర్థికంగా ఎదగాలని, ఇక్కడ తయారు చేస్తున్న న్యూట్రి మిక్స్ ఆహార పదార్థాలు అధికారిక సభలు సమావేశాలలో, గిరిజన దర్బార్, జనాలు ఎక్కువగా తిరిగే పార్కులలో, సీతారామచంద్రస్వామి దేవస్థానం దగ్గర, సూపర్ మార్కెట్లలో అలాగే అన్ని గ్రామాలలో కొనుగోలు చేసే విధంగా ప్రచారము అయ్యేలా చూడాలని, మహిళలు మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చిన్న తరహా పరిశ్రమను వృద్దిలోకి తీసుకొచ్చి లాభాల బాటలో నడిచేలా చూడాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, రామ్ కుమార్, రామమ్మ, రాధమ్మ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. అదనపు పౌర సంబంధాల అధికారికార్యాలయం భద్రాచలం నుండి జారీ చేయడం అయినది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News