15 ఏళ్ల పోరాటానికి ఫలితం..
సమిష్టి పోరాట తత్వానికి నిదర్శనం ఈ విజయం ..
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ
నేటి సాక్షి, భద్రాచలం :
రేగళ్ల ప్రాంతంలో 70 సంవత్సరాలకు పైబడి సేద్యం చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని గత 15 సంవత్సరాలుగా సిపిఎం ఎర్రజెండా నాయకత్వంలో చేసిన పోరాటాల ఫలితంగా గిరిజనులు ఐక్యంగా ఉద్యమించబట్టి నేడు పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ తెలిపారు.
బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయము నందు ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్ గారు అర్హులైన పేదలందరికీ 400 మందికి నేడు పట్టాలు పంపిణీ చేశార ఈ కార్యక్రమం సందర్భంగా అన్నవరపు సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ రేగళ్ల ప్రాంతంలో దోరలు అమాయక గిరిజనులను భూముల పేరుతో మోసం చేస్తూ భూమికి పట్టాకు హక్కు కల్పించకుండా అనేక ఇబ్బందులు గురి చేశారని ఈ నేపథ్యంలో సిపిఎం ఎర్రజెండా నాయకత్వంలో తాసిల్దార్ ఆర్డీవో కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమాలు పాదయాత్రలు దశల వారి ఆందోళన చేసిన ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి గత సంవత్సరం పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఆయన అన్నారు పంపిణీ చేస్తున్న పట్టాలను పంపిణీ చేయకుండా నాడు భూస్వాములు ప్రభుత్వ పెద్దలు కలిసి కోర్టుకు వెళ్లి పేదలకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువచ్చి పట్టాలు పంపిణీ అడ్డుకున్నారని ఆయన అన్నారు దీనిపై గిరిజన ప్రజలు ఎర్రజెండా సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రతో కలెక్టర్ కార్యాలయం చేరుకొని పెద్ద ఎత్తున దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత కలెక్టర్ స్వయంగా పిలిచి కోర్టు పెండింగ్లో ఉన్న బట్టి ఆగాము కౌంటర్ పిటిషన్ తయారుచేసి కోర్టుకు సమర్పిస్తామని అనంతరం సర్వే చేసి పట్టాలకి పంపిణీ కార్యక్రమానికి చేపడతామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు దీనిపై రైతులు కూడా అధికారులపై నమ్మకం లేకుండా కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ని రద్దు చేసే పిటిషన్ వేసి ఆ పిటిషన్ రద్దు చేయించి, రైతుల కి పట్టాలు తక్షణం మంజూరు చేయాలని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు దీనిపై సర్వేల పేరుతో ఆరు నెలలు కాలయాపన చేశారని అయినా సిపిఎం పట్టు వదలకుండా పోరాడబట్టి నేడు ఐటిడిఏ పిఓ గారు పట్టాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు ఇది ఈ ప్రాంత గిరిజనులు ఐక్యంగా ఎర్రజెండా సిపిఎం నాయకత్వంలో కదిలి పోరాడబట్టి ఈ విజయం సాధించడం జరిగిందని ఆయన అన్నారు పోరాడితే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వాంకుడోత్ కోబల్ తేజావత్ వెంకన్న వాంకుడోత్ సురేష్ వాంకుడోత్ సీతారాం బానోతు మల్సూర్ సేవాలాల్ హనుమంతు దరియా శంకర్ సాదు లక్ష్మణ్ రాందాస్ శీను బాల్య సారయ్య తదితరులు పాల్గొన్నారు





