నేటి సాక్షి, కొత్తగూడెం :
ఫ్లై యాష్ లారీని అమ్మడానికి ప్రయత్నించిన వ్యక్తులకు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మూడవ అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ. సుచరిత బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా…. మణుగూరు సుందరయ్య నగర్ కు చెందిన ముల్లంగి శ్రీనివాసరెడ్డి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుండగా ఆరు లారీలు ఉన్నాయని, ఏపీ- 20 -టీబీ-0455 మహేంద్ర నవే స్టాల్ )ఆష్ ట్యాంకరు, 6 నెలలనుండి పని చేస్తున్న తన డ్రైవర్ అయిన ఈసం వీరస్వామి కి ఇచ్చి 2015-5-26 న పాల్వంచ నుండి ఆష్ లోడు చేసుకొని గుంటూరు జిల్లా రెంటచింతల దగ్గర చెట్టిపాలెం లో గల పరాశక్తి సిమెంట్ కంపెనీకి ఆష్ ను 2015 మే 27 న అన్లోడ్ చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో చిల్లకల్లు నందు ఇద్దరు ప్యాసింజర్లను ఎక్కించుకున్నాడని సుమారు రాత్రి 8:30 ప్రాంతంలో ఖాళీ ఆష్ ట్యాంకర్ ను ఆపి ఒంటి గుడిసెకు వెళ్లి వస్తానని వెళ్లి వచ్చేలోగా ఆష్ ట్యాంకర్ కనిపించలేదని రాత్రి పదిన్నరకు ఫోన్ చేశారని లోన ఉన్నవారు కూడా లేరని తెలుపగా తను ఆష్ ట్యాంకర్ కొరకు వెతికి, దొరకనందున జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మల్లయ్య స్వామి గౌడ్ దర్యాప్తులో 10. 6. 2015 న లారీ దొరికినందున దర్యాప్తు అనంతరం 1)ఈసం వీరస్వామి 2) ఏనుకూరు మండలం గంగుల నాచారం కు చెందిన పూనం వెంకటేశ్వర్లు ఏరియాస్ వెంకటేష్ ల ఇద్దరిపై కోర్టులో చార్షీషీట్ దాఖలు చేశారు. కోర్టులో ఆరుగురు సాక్షులను విచారించారు. పై ఇద్దరిపై నేరమ రుజువు కాగా, సెక్షన్ 411 ఐపిసి ప్రకారము ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాస్క్యూషన్ను పి ప్రసాద్ మరియు నాగలక్ష్మి నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ పి ప్రవీణ్, లైజాన్ ఆఫీసర్ ఎస్కే అబ్దుల్ ఘని, జూలూరుపాడు పిసి( కోర్టు డ్యూటీ ఆఫీసర్ ) పి.ఉపేందర్ రావు సహకరించారు.





