- సరస్వతి, నర్మదా పుష్కర ఘాట్ ను ప్రారంభించిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి

నేటి సాక్షి,కొమురం భీం : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాళేశ్వర ఆలయ సమీపంలో శ్రీ దండానాయకుల శ్రీనివాస్ రావు గారి స్మృతిలో సరస్వతి, నర్మదా పుష్కర ఘాట్ ను ప్రారంభించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసిఫాబాద్ లో అతి పురాతనమైన ఆలయంగా పేరొందింది అని అన్నారు. ఆలయ సమీపంలో జాతర నిర్వహిస్తారు అని అన్నారు. భక్తుల పుణ్య స్నానాల కోసం సరస్వతి,నర్మదా పుష్కర ఘాట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్య్రమంలో ఆసిఫాబాద్ సింగిల్ విండో ఛైర్మెన్ అలీ, ఆసిఫాబాద్ మాజీ జెడ్పీటీసీ అరిగేలా నాగేశ్వర్ రావు, పార్టీ అధ్యక్షులు రవీందర్, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.





