- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గం పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున జిల్లాలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంసిసి నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 3, 2025న నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా అనుసరించాలని, ఉల్లంఘించినట్లయితే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.





