- ఇబ్రహింపట్నం మండల పద్మశాలి సంఘ అధ్యక్షులు చాట్ల గణేష్
నేటిసాక్షి, ఇబ్రహింపట్నం : ఫిబ్రవరి 1 మండల కేంద్రం తో పాటు మండలం లోని గ్రామాలలో శనివారం పిబ్రవరి 1వ తేదీ రోజున పద్మశాలి సంఘల సభ్యులు మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండల పద్మశాలి సంఘ అధ్యక్షులు చాట్ల గణేష్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్మశాలి ఐక్యతకు నిదర్శనం మార్కండేయ జయంతి అని, జయంతి ని ఘనంగా నిర్వహించాలని సుచించారు. మండల గ్రామాల్లో పద్మశాలి ఐక్యతను చాటాలని అయన పెర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గం సభ్యులు కంఠం రాజ్ కుమార్, బుస రమేష్ , ఉడుత రాజు, గంగాధర్, మారుతి, శ్రీధర్ ,శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.





