నేటిసాక్షి, మంగపేట : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేక పథకాలు అమలు చేయడంలో విఫలమైనందున బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు బిఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో అమరవీరుల స్తూపం దగ్గర మహాత్మా గాంధీ చిత్రపటానికి బిఅర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైనా హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రోజు నుండే హామీలపై రకరకాల సాకులతో కాలం వెళ్లదీస్తూ కొన్ని పథకాలకు ఏవేవో కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది. నాలుగు కొత్త పథకాలు రాష్టం అంతటా అమలు చేస్తానని చెప్పి మండలంలో ఒక్కొక్క గ్రామానికి ఎన్నో కొన్ని ఇచ్చి చేయి దులుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 420 రోజులు దాటుతున్న నాలుగో వంతు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బిఅర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము రైతు బందు సంవత్సరానికి రెండు విడుతలుగా క్రమం తప్పకుండ ఎకరాకు 10 వేల చొప్పున మొత్తం 73,162 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత కెసిఆర్ బిఅర్ఎస్ ప్రభుత్వానిది కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలను నమ్మినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో రోజుకో రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికైనా అధికారం కోసం ఆలోచనలు చేయకుండా ప్రజల అభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ రాష్టాన్ని అభివృద్ది పదంలో నడిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటి చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పాక్స్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, తాటి కృష్ణ కూర్బన్ ఆలీ, కొమరం ధనలక్ష్మి మహిళ మండల అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మి, కాటూరి సుగుణ, అనురాధ, సొసైటీ డైరెక్టర్లు అచ్చ సత్యనారాయణ, సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు, సింగిరిబోయిన నర్సయ్య, చల్లగురుగుల తిరుపతి, మార్పుల, వెంకట్ రెడ్డి, మాలికంటి శంకర్, నిమ్మగడ్డ ప్రవీణ్ అయూబ్, కర్రీ శ్రీను, పూజారి సతీష్, బియ్యం శ్రీను, బిసు సాంబయ్య, మీడియా ఇంచార్జి, గుడివాడ శ్రీహరి పాల్గొన్నారు.





