Monday, March 16, 2026

అహింసా మార్గంలో స్వాతంత్రం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ

  • జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి

నేటి సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జనవరి 30 : అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా అధికారులతో కలిసి స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగాలతో అసువులు బాసిన మహనీయులను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ సంకెళ్ల నుండి అహింసా మార్గంలో అలుపెరగని పోరాటం చేసి సత్య దీక్షతో స్వాతంత్రానికి కృషి చేసిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ దేశానికి జాతిపితగా చిరస్మరణీయులని అన్నారు. మహాత్మ సత్యం, అహింస మార్గాలను ఆచరించి మనందరికీ ఆదర్శంగా నిలిచారని, మహాత్ముడు చూపిన సన్మార్గంలో ముందుకు వెళుతూ దేశాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News