- గాంధీజీ విగ్రహానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వినతి
నేటి సాక్షి, రామడుగు(పురాణం సంపత్): కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను నెరవేర్చేలా చూడండి అని గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన చేపట్టారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూడూరి మణెమ్మ మల్లేశం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చాలని గ్రామంలోని గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మణెమ్మ-మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులైనా కూడా 420 హామీలను నెరవేర్చకుండా కాళీ మాటల ప్రభుత్వం గానే ఉన్నది తప్ప సామాన్యుడికి ఇప్పటికీ ఎలాంటి హామీలను కూడా నెరవేర్చలేదని అన్నారు. అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబానికి 20 కిలోలు ఉన్న బియ్యాన్ని ఎత్తివేసి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల బియ్యం 6 కిలోల బియ్యాన్ని కెసిఆర్ ఇచ్చారని అన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ ఏదో చారిత్రాత్మక కార్యక్రమంలా చేస్తున్నారని ఎద్దేవ చేశారు. గురుకులాలలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కల్తీ ఆహారం తిని 55 మంది పైగా విద్యార్థులు మరణించిన తీరు మారలేదని దుయ్యబుట్టారు. ఇకరైనా దొంగ హామీలు దొంగ వాగ్దానాలు బందు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా పాలన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అశోక్, బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం, విద్యార్థి విభాగం మండల నాయకులు కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.





